Site icon HashtagU Telugu

Shilpa Shetty: విసుర్రాయి తిప్పుతూ తెగ కష్టపడుతున్న శిల్పాశెట్టి.. నెట్టింట వీడియో వైరల్?

Mixcollage 07 Feb 2024 07 47 Am 3334

Mixcollage 07 Feb 2024 07 47 Am 3334

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి వ్యతిరేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ దక్కించుకుంది శిల్పా శెట్టి. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య ఒకసారి తన భర్త రాజకుంద్రా పోలీస్ కేసు విషయంలో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే శిల్పా శెట్టి తాజాగా నటించిన వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఇది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇందులో శిల్పా శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ వెబ్ సిరీస్ ను చూసిన ప్రతి ఒక్కరూ శిల్పా నటనను మెచ్చుకుంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే శిల్పా శెట్టి ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఫిట్నెస్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఫిట్నెస్ అంటే ప్రాణం కూడా పెడుతుంది శిల్పా శెట్టి. 48 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉండే శిల్పాశెట్టి యోగా, వర్కౌట్‌లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శిల్పా శెట్టి రోజూ తన వర్కౌట్స్ వీడియలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. కొత్త కొత్త వ్యాయామాలు, యోగాసనాలు వేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

 

ఈ నేపథ్యంలోనే తాజాగా శిల్పాశెట్టి ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. తాజాగా శిల్పాశెట్టి రాజస్థాన్ పర్యటించింది. అంతకుముందు శిల్పాశెట్టి తన యూట్యూబ్ ఛానెల్‌లో చక్కీ చలసానా వీడియోను పోస్ట్ చేసింది. చక్కీ చలసానా అంటే ఎదో అనుకోకండి విసుర్రాయి. అలా కూర్చోవడాన్నే చక్కీ చలసానా అంటారు. ఇలా విసుర్రాయి తిప్పే సమయంలో మహిళలు కూర్చున్న భంగిమ అలాగే ఆ రాయిని తిప్పడం చేసేటప్పుడు శరీరం చాలా బలంగా తయారవుతుంది. చక్కి చలసానా చేతులను బలపరుస్తుంది. అలాగే ఇది వెన్నుముక, మోకాలి కండరాలను బలపరుస్తుందని శిల్పాశెట్టి చెప్పుకొచ్చింది. ఒకప్పుడు గోధుమలు నూరడానికి తిరగలి ఉండేది. అప్పటి మహిళలు దాన్ని వాడే పిండి తయారు చేసేవారు. అందుకే వాళ్ళు అంత బలంగా ఉండేవారు. ఇక ఇప్పుడు శిల్ప ఈ వీడియో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. విసుర్రాయి తిప్పడానికి శిల్పా శెట్టి చాలా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఆ విసుర్రాయి తిప్పుతూ కష్టపడుతూ ఉన్న వీడియోని షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

Exit mobile version