Site icon HashtagU Telugu

Actress: ఆ నిర్మాతలు నన్ను బెడ్ షేర్ చేసుకోమన్నారు.. సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్?

Actress

Actress

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది సర్వసాధారణం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా నటీమణులు హీరోయిన్లు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఏదో సందర్భంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొనే ఉంటుంది. అయితే ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంకొందరు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురైనప్పటికీ బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు. తాజాగా కూడా ఒక హీరోయిన్ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి చెబుతూ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఒక ప్రొడ్యూసర్ తానను లైంగికంగా వేధించాడని తెలిపింది హీరోయిన్. ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ ఎవరు అని అనుకుంటున్నారా, ఆమె మరెవరో కాదండోయ్ సనమ్ శెట్టి. మొదట అంబలి అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళంలో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సింగం 123, ప్రేమికుడు లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.

కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే తాజాగా సనమ్ శెట్టి తమిళ సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవకాశాలు ఇస్తాం.. బెడ్ షేర్ చేసుకోవాలి అంటూ కొంతమంది నిర్మాతలు తనను ఇబ్బంది పెట్టారని ఆమె తెలిపింది. కోలీవుడ్ లో లింగ వివక్షత విపరీతంగా ఉంటుంది. రెమ్యునరేషన్స్ విషయంలో చాలా తేడా ఉంటుంది. ఫోన్ చేసి సినిమా ఆఫర్ ఇస్తాం రండి అని పిలిచి తమతో గడపాలని అప్పుడే ఛాన్స్ ఇస్తామన్నట్టు మాట్లాడతారని సనమ్ శెట్టి తెలిపింది. ముఖ్యంగా తనను నిర్మాతలు చాలా ఇబ్బంది పెట్టినట్టు ఆమె చెప్పుకొచ్చింది.