Rozly Khan : క్యాన్సర్ తో పోరాడుతున్న ప్రముఖ నటి…హాస్పిటల్ నుంచి ఎమోషనల్ పోస్ట్..!!

  • Written By:
  • Publish Date - November 12, 2022 / 06:50 AM IST

బాలీవుడ్ నటి, మోడల్ రోస్లీన్ ఖాన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వార్త విన్న రోస్లిన్ ఖాన్ అభిమానులు ఆందోళనచెందారు. ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలిపింది. అంతేకాదు రోస్లిన్ పోస్ట్ చేసిన స్టోరీని చదివి ఆమె అభిమానులు…క్యాన్సర్ నుంచి కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు.

రొస్లిన్ ఏమని పోస్ట్ చేసిదంటే…
క్యాన్సర్..కష్టజీవుల జీవితం ఈజీ కాదు. ఎక్కడో చదవాను. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్లకు అలా జరుగుతుందని తెలిసింది. దేవుడు తన బలమైన సైనికులకు కష్టతరమైన పోరాటాన్ని ఇస్తారు. ఇది నా జీవితంలో ఒక అధ్యాయం కావచ్చు. నాకోసం దేవుడిని ప్రార్థించే కొంతమంది ఉన్నారు. ఏది జరిగినా అది మన మంచికే జరుగుతుంది. ఆ మంచి నాకే జరిగింది. మెడ, వెన్నులో తీవ్రమైన నొప్పి తప్పా ఎలాంటి సమస్య లేదు. నేను జిమ్నాస్టిక్ నొప్పి అనుకున్నాను. కానీ తర్వాత తెలిసిందే. నాకు క్యాన్సర్ సోకిందని. ఈ పోస్ట్ చదివిని ఆమె అభిమానులు బాధపడ్డారు. రోస్లిన్ త్వరగా కోలుకోవాలని..క్యాన్సర్ జయించే ధైర్యం కావాలని ప్రార్ధిస్థున్నారు.

రోస్లిన్ ఖాన్ సమీర్ అంజాన్ పాట ఆ బీ జాలో చివరిసారిగా కనిపించింది. రజనీష్ సరసన నటించింది. రోస్లిన్ పెటా, ఐపీఎల్ లో పనిచేశారు. చాలా ఐటెమ్ పాటల్లో ఉన్నారు. రోస్లిన్ బోల్డ్ ఫోటోషూట్స్ చాలా వివాదస్పదంగా మారాయి. ఆమె బికినీ ఫోటోలు అప్పట్లు వైరల్ గా మారాయి. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడంలో రోస్లిన్ పనిచేసింది. అంతేకాదు చాలా టీవీ యాడ్స్ లోనూ కనిపించింది. సవితా భాభి క్యారెక్టర్ ఆమెకు మంచి గుర్తింపును ఇచ్చింది.