తమిళం, తెలుగు సినిమాల్లో ఓ మెరుపు మెరిసిన రంభ పూర్తిగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. తన తోటి హీరోయిన్స్ అక్క, చెల్లి, తల్లి పాత్రలు చేస్తుంటే.. రంభ మాత్రం ఫ్యామిలీతో గడపడానికే ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం కెనడాలో తన కుటుంబంతో సంతోషకరమైన జీవితం గడుపుతోంది. ఓ పెళ్లి కోసం భారతదేశానికి తిరిగి వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ తిరుమలలో కనిపించింది. తిరుమల పుణ్యక్షేత్రం పరిసరాల్లో కనిపించిన రంభ తన కుటుంబంతో కలిసి బాలాజీని ప్రార్థించినట్లు పేర్కొంది. శ్రీవారి దర్శనం బాగా జరిగిందని ఈ ప్రముఖ నటి తెలిపింది. తన అక్క కుమార్తె పెళ్లిని చూసేందుకు తాము ఇండియాకు వచ్చామని, తాను ప్రస్తుతం పిల్లలతో జీవితం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.
Rambha At Tirumala: శ్రీవారిని దర్శించుకున్న నటి రంభ

Rambha