Site icon HashtagU Telugu

Rakul Preet Singh: వామ్మో.. రకుల్ పెళ్లికి ఎంచుకున్న హోటల్ గదికి రోజుకు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Mixcollage 17 Feb 2024 10 09 Am 6621

Mixcollage 17 Feb 2024 10 09 Am 6621

రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నాని.. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేర్లు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎట్టకేలకు ఫిబ్రవరి 21న వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. దాంతో ఈ జంట పెళ్లికి సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరూ ముందుగా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పెళ్లి వేదికను గోవాకు షిఫ్ట్ చేశారు.

గోవాలోని ఒక విలాసవంతమైన హోటల్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వివాహానికి కొద్దిమంది అతిధులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్‌లో రకుల్, జాకీ పెళ్లి చేసుకోనున్నారు. ఐటీసీ గ్రాండ్ 246 గదులతో కూడిన విలాసవంతమైన హోటల్. 45 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్న ఈ రిసార్ట్ చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది. జాకీ, రకుల్‌లు ఈ హోటల్‌ని ఎంచుకున్న వెంటనే చాలా మందికి దీని గురించి తెలుసుకోవాలని చూపిస్తున్నారు. మరి ఆ హోటల్ లో ఒక్కో గదికి డబ్బులు ఎంత అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కాగా గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో గది ధర 19 వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర 75 వేల రూపాయల వరకు ఉంది. ఇందులో చాలా పన్నులు కూడా ఉన్నాయి. మూడు రోజుల పాటు గోవాలో పెళ్లి వేడుక జరగనుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ హోటల్ లో ఒక్కొక్క గది ఖరీదు తెలిసి అభిమానులు, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఒక్క రోజుకు ఏకంగా అన్ని వేలా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version