Site icon HashtagU Telugu

Kiran Abbavaram: కాబోయే భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్.. నా సర్వస్వం నువ్వే అంటూ?

Mixcollage 15 Mar 2024 10 11 Am 1122

Mixcollage 15 Mar 2024 10 11 Am 1122

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి మనందరికీ తెలిసిందే. రాజావారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో నిన్ను తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అవ్వడంతో పాటు హీరోగా భారీగా క్రేజ్ ని ఏర్పరుచుకున్నారు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా ఆఫర్స్ అందుకున్నాడు కిరణ్. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.

అయినా కూడా వెనకాడుగు వేయకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ కుర్ర హీరో పెళ్ళికి రెడీ అయ్యాడు. ఇటీవలే కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు కూడా కిరణ్ అవవరం ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్యతో ఆయన ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ దాదాపు 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

కానీ వీరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు బయటకు రాలేదు. ఆ మధ్య ఒకటి రెండు వార్తలు వచ్చినా దాని పై ఇద్దరూ స్పందించలేదు. ఇక ఇప్పుడు ఇలా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తాజాగా తమ ప్రేమ గురించి హీరోయిన్ రహస్య మాట్లాడింది. ఈ మేరకు ఆమె ఒక వీడియోను రిలీజ్ చేసింది. కిరణ్ లానే రహస్య కూడా షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. రాజావారు రాణిగారు సినిమా తర్వాత రహస్య సినిమాలను పక్కన పెట్టేసింది. ఎంగేజ్ మెంట్ తర్వాత తన ప్రేమ గురించి రహస్య సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

 

ఆరేళ్లుగా నువ్వు నాకు తెలుసు. మంచి స్నేహితులుగా ఉన్నాము. ప్రేమలో పడ్డాము. ఎన్నో మాట్లాడుకున్నాము. ఎలాంటి ప్లానింగ్ లేకుండానే చాలా ట్రిప్స్‌కి వెళ్లాము. ఎన్నో ఆటుపోట్లను చూశాము. మొత్తానికి మనిద్దరిదీ అద్భుతమైన, అందమైన జర్నీ. నీతోపాటు ఈ జర్నీని కంటిన్యూ చేయాలని చాలా ఆత్రుతగా ఉన్నాను. నా సర‍్వస్వం నువ్వే కిరణ్ అబ్బవరం అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది రహస్య. అలాగే ఈ ఇద్దరికీ సంబందించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.