Site icon HashtagU Telugu

Priyamani: వయసు పెరుగుతున్న తరగని అందం ప్రియమణి సొంతం.. యంగ్ హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా!

Mixcollage 14 Feb 2024 09 29 Am 5112

Mixcollage 14 Feb 2024 09 29 Am 5112

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రియమణి. మొదట ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రియమణి తెలుగులో గోపీచంద్, ఎన్టీఆర్, జగపతిబాబు, నితిన్, బాలకృష్ణ రవితేజ లాంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం,మలయాళం,కన్నడ,హిందీ సినిమాలలో కూడా నటించింది. ఎక్కువగా మాత్రం తెలుగు సినిమాలలోనే నటించింది ప్రియమణి. అంతేకాకుండా కన్నడ హిందీ తెలుగు భాషల్లో జడ్జిగా కూడా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర పైన కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సినిమాలలో పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకూడా జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ప్రియమణి ఒకవైపు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది.

కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యువతకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియమణి తన ఇంస్టాగ్రామ్ కాదు నీ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో పద్ధతిగా పంజాబీ డ్రెస్ ను ధరించిన ఆమె సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫొటోస్ లో ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. వయసు పెరుగుతున్న కూడా ప్రియమణి అందం ఏం మాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలి అంటే వయసుతో పాటు ప్రియమణి అందం కూడా పెరుగుతోంది. యంగ్ హీరోయిన్స్ సైతం కుళ్ళుకునే విధంగా అందాలను ఆరబోతున్న గ్లామర్ షో చేస్తోంది.