Site icon HashtagU Telugu

Actress Prema : నాకు క్యాన్సర్ వచ్చింది అన్నారు.. నా రెండో పెళ్లిపై రూమర్స్ వచ్చాయి..

Actress Prema comment on the rumors about her

Actress Prema comment on the rumors about her

సవ్యసాచి(Savyasachi) అనే సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రేమ(Prema) తెలుగులో దేవి, చిరునవ్వుతో, రాయలసీమ రామన్న చౌదరి, ప్రేమతో రా, దేవిపుత్రుడు, ఢీ.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఎక్కువగా తెలుగు(Telugu), కన్నడ(Kannada) భాషల్లోనే సినిమాలు చేసింది ప్రేమ. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. 2009 నుంచి దాదాపు 8 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉంది ప్రేమ.

2006లో ప్రేమ పెళ్లి చేసుకోగా పదేళ్ల తర్వాత 2016లో తన భర్తతో విడాకులు తీసుకుంది. విడాకుల అనంతరం అనంతరం మళ్ళీ సినిమాల్లోకి రావాలని ట్రై చేసి ఓ రెండు సినిమాల్లో చిన్న పాత్రలు వేసింది. ప్రస్తుతం అవకాశాల కోసం చూస్తుంది ప్రేమ. కన్నడ, తెలుగు పరిశ్రమలలో మంచి క్యారెక్టర్ వస్తే ఇకపై రెగ్యులర్ గా సినిమాలు చేస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇదే ఇంటర్వ్యూలో తనపై వచ్చిన రూమర్స్ గురించి కూడా మాట్లాడింది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ తనపై వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడుతూ.. విడాకుల తర్వాత నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోవడంతో కొన్ని రోజులు ఆస్ట్రేలియాకు వెళ్ళాను. నేను కొన్ని నెలలు కనపడకపోయేసరికి ఇక్కడి మీడియా నాకు క్యాన్సర్ వచ్చింది అని రాసేసింది. నాకు ఎలాంటి క్యాన్సర్ రాలేదు, నేను బానే ఉన్నాను అని తెలిపింది.

అలాగే తన రెండో పెళ్లిపై వచ్చిన రూమర్స్ గురించి ప్రేమ మాట్లాడుతూ.. నేను ఇటీవల రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అనే వార్తలు వచ్చాయి. అవి అబద్దం. జీవితంలో పెళ్లి అవసరమే. నాకు కావాల్సిన అబ్బాయి దొరికినప్పుడు మళ్ళీ నేను రెండో పెళ్లి చేసుకుంటాను అని తెలిపింది.

 

Also Read :  KGF3 Update: రాకీభాయ్ మళ్లీ వస్తున్నాడు.. కేజీఎఫ్3 అప్ డేట్ ఇదిగో!