Site icon HashtagU Telugu

Prashanthi Harathi : ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమాలో సునీల్ వైఫ్ క్యారెక్టర్ గుర్తుందా? 20 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ..

Actress Prashanthi Harathi Re Entry in Tollywood after 20 Years

Actress Prashanthi Harathi Re Entry in Tollywood after 20 Years

పెళ్ళాం ఊరెళితే సినిమాలో సునీల్(Sunil) భార్య పాత్రలో అమాయకంగా భారత ఏం చేసినా కరెక్ట్ అనే పాత్రలో నటించిన నటి గుర్తుందా? ఆ నటి పేరు ప్రశాంతి హారతి(Prashanthi Harathi). చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ప్రశాంతి, క్లాసికల్ డ్యాన్స్ ఫోటోషూట్స్ కి వెళ్లడంతో అలా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఫిబ్రవరి 14 నెక్టెస్ రోడ్, రూపాయి, ఇంద్ర, పెళ్ళాం ఊరెళితే.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. పలు సీరియల్స్ లో కూడా నటించింది. ఇక క్లాసికల్ డ్యాన్సర్ గా ఎన్నో పర్ఫార్మెన్స్ లు ఇచ్చింది.

అయితే ప్రశాంతి హారతి పెళ్ళాం ఊరెళితే సినిమా తర్వాత పలు అవకాశాలు వచ్చినా ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్లినా సినిమాలు చేయట్లేదని బాధపడేది. అయితే తన భర్త సపోర్ట్ చేయడంతో అక్కడే అమెరికాలో కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ఒకటి స్థాపించి అమెరికాలోని పిల్లలకు కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తుంది. ఇన్నాళ్లుగా అమెరికాలోనే ఉన్న ప్రశాంతి ఇప్పుడు తన పిల్లలు పెద్దవాళ్ళు అవడంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇద్దామనుకుంటుంది.

ఈ నేపథ్యంలో ప్రశాంతి హారతి హైదరాబాద్ కి తిరిగి వచ్చింది. పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

ప్రశాంతి హారతి మాట్లాడుతూ.. నటిగా నా కెరీర్ లో సుదీర్ఘ విరామం వచ్చింది. ఇప్పటికీ యాక్టింగ్ మీద ప్యాషన్ తగ్గలేదు. అందుకే మళ్లీ టాలీవుడ్ కు తిరిగివచ్చాను. ఇన్నాళ్లు అమెరికాలో పిల్లలకు కూచిపూడి నేర్పిస్తున్నాను. నేను యాక్టింగ్ కోర్సులు నేర్చుకోలేదు. క్లాసికల్ డ్యాన్స్ నుంచే సినిమాల వైపుకి వెళ్ళాను. ఇప్పుడు సినిమాలు, ఓటీటీ, యూట్యూబ్, సీరియల్స్, సిరీస్ లు అని చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే క్యారెక్టర్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ నా నటనని చూపిస్తాను. టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తే బిజీ అవ్వడానికి రెడీగా ఉన్నాను అని తెలిపింది.

అలాగే.. మా పాప కూడా నా దగ్గరే కూచిపూడి నేర్చుకుంది. ఇటీవలే మా పాప తాన్యతో VN ఆదిత్య దర్శకత్వంలో తెలుగింటి సంస్కృతి అనే ఓ మ్యూజిక్ ఆడీయో చేసాము. తన ఏజ్ కు తగ్గట్టు సినిమాల్లో మంచి అవకాశం వస్తే తనని కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తాను అని తెలిపారు ప్రశాంతి హారతి.

 

Also Read : Vijay Deverakonda: విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాల లిస్ట్