Actress Pragati: ‘ఐ యామ్ సింగిల్’ అంటున్న ప్రగతి అంటీ!

క్యారెక్టర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెరపై తల్లి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న

Published By: HashtagU Telugu Desk
Pragati

Pragati

క్యారెక్టర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెరపై తల్లి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి సోషల్ మీడియాలో విభిన్నమైన ఇమేజ్‌ని అందజేస్తుంది. వీడియోలతో తన ఫాలోవర్లను అలరిస్తోంది. ఆమె వర్క్ అవుట్ చేస్తూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోలతో నెటిజన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.

నలభై ఏళ్లు దాటినా అందాలను ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడటం టేదు. ప్రస్తుతం పెద్ద కొడుకుతో కలిసి చెన్నైలో నివసిస్తోంది. ఆమె ఒంటరి తల్లి. పెళ్లిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో తన భర్తకు విడాకులు ఇచ్చానని ప్రగతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను చాలా కాలంగా ఒంటరిగా ఉన్నానని, మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. లాక్‌డౌన్‌ సమయంలో తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ప్రగతి పేర్కొన్నారు.

  Last Updated: 27 Oct 2022, 01:06 PM IST