Site icon HashtagU Telugu

Actress Pragathi: హాట్ లుక్స్ తో హీటెక్కిస్తున్న ప్రగతి ఆంటీ!

Pragati

Pragati

టాలీవుడ్ లో సపోర్టింగ్స్ రోల్స్ (అత్త, అక్క, తల్లి) అనగానే చాలామందికి గుర్తుకువచ్చే పేరు నటి ప్రగతి. అందుకుతగ్గట్టుగానే స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ.. మంచి పేరు తెచ్చుకుంది. చాలా ఏళ్లుగా నటిగా రాణిస్తోంది. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది.  ప్రస్తుతం తల్లి, అత్త తరహా పాత్రలకు ప్రగతినే ఫస్ట్ ఛాయిస్. సెంటిమెంట్ పండిస్తూనే కామెడీ టచ్ తో ఆకట్టుకునే నైపుణ్యం ప్ర‌గ‌తిలో ఉంది. ఎఫ్ 2 చిత్రంలో ప్రగతి కామెడీ టైమింగ్ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఎఫ్3 లో కూడా నటిస్తోంది.

గత కొంతకాలంగా ప్రగతి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలను అప్ లోడ్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సాధారణంగా తనలాంటి వయస్సువాళ్లు ఇంటికే పరిమితమవుతుంటే.. ప్రగతి మాత్రం తనకు నచ్చినట్టుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ.. లెటెస్ట్ పాటలకు తనదైన స్టయిల్ స్టెప్పులు వేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటోంది. ఇక డ్రస్సింగ్ లోనూ యువతతోనూ పోటీ పడుతోంది ఈ సీనియర్ నటి. వెస్ట్రన్, ట్రెడిషనల్ అనే తేడా లేకుండా ఇష్టమైన దుస్తులు ధరిస్తూ సోషల్ మీడియాను తనవైపు తిప్పుకునేలా చేస్తోంది.