Adipurush Ravan: రావణుడు ఎన్టీఆర్, ఎస్వీఆర్ లా ఉంటాడు.. ఓంరౌత్ పై కేజీఎఫ్ నటి కామెంట్స్!

ప్రభాస్‌, సైఫ్‌ అలీఖాన్‌ జంటగా నటించిన ‘ఆదిపురుష్‌’ టీజర్‌ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి.

  • Written By:
  • Updated On - October 4, 2022 / 03:20 PM IST

ప్రభాస్‌, సైఫ్‌ అలీఖాన్‌ జంటగా నటించిన ‘ఆదిపురుష్‌’ టీజర్‌ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి. విజువల్ ఎఫెక్ట్స్ మేకర్స్ పై భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఆ నేేపథ్యంలో రాజకీయ నాయకురాలు,  కేజీ ఎఫ్ నటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఆదిపురుష్’ భారతీయ పౌరాణిక ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కింది. ప్రభాస్ రాముడిగా, సైఫ్ రావణుడు, కృతి సనన్ సీతగా నటించారు.

రామాయణాన్ని తప్పుగా చూపించారంటూ (కేజీఎఫ్ ఫేం) మాళవిక అవినాష్ ‘ఆదిపురుష్’  దర్శక నిర్మాతలపై మండిపడ్డారు. సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రను చిత్రీకరించిన విధానాన్ని ఆమె ప్రత్యేకంగా నొక్కి చెప్పింది. వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, తులసీదాసు రామాయణం ఇలా అనేక రామాయణ గురించి తెలియజేస్తూ డైరెక్టర్  ఓంరౌత్ పై మండిపడింది. కన్నడ సినిమాలు, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు రావణుడు ఎలా ఉంటాడో స్పష్టంగా చూపించాయని కామెంట్స్ చేసింది.

రావణుడు ఎలా ఉన్నాడో అర్థం చేసుకోవడానికి ‘భూకైలాస’లో ఎన్టీఆర్, ‘సంపూర్ణ రామాయణం’లో ఎస్‌వి రంగారావు లాంటివాళ్లను చూస్తే చాలు అని అన్నారు. నీలి కళ్ల అలంకరణతో, లెదర్ జాకెట్లు ధరించి ఉన్న వ్యక్తి ఎలా రావణుడు అవుతాడని ఈ నటి ప్రశ్నించింది. రామాయణం ఈ దేశాన్ని, దాని నాగరికతను ప్రజలను సూచిస్తుంది. కాబట్టి సినిమా దర్శకుడు అలాంటి చారిత్రత్మకమైన ప్రాతలపై ఫోకస్ చేయాలి” అని తన ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆదిపురుష్ ట్రోల్స్ తో పాటు ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.