Namitha Blessed Twins: పండంటి కవలలకు జన్మనిచ్చిన నమిత

ప్రముఖ నటి నమిత కృష్ణ జన్మాష్టమి రోజున తనకు కవల మగబిడ్డలు పుట్టారని వెల్లడించారు.

Published By: HashtagU Telugu Desk
Namitha

Namitha

కృష్ణ జన్మాష్టమి రోజున తనకు కవల మగబిడ్డలు పుట్టారని ప్రముఖ నటి నమిత వెల్లడించారు. మల్లిరెడ్డి వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న నమిత కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ లో వెల్లడించారు. “హరే కృష్ణ! ఈ శుభ సందర్భంలో మా సంతోషకరమైన వార్తను మీ అందరితో పంచుకోవడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. మేం కవల అబ్బాయిలతో ఆశీర్వదించబడ్డాం.

మీ ఆశీర్వాదాలు, ప్రేమ ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాం. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, క్రోంపేట వారి అద్భుతమైన హెల్త్ కేర్ n సేవలకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నాం. నా ప్రెగ్నెన్సీ జర్నీని సంతోషంగా సాగేలా చేసి, మార్గనిర్దేశం చేసిన డాక్టర్ భువనేశ్వరి, ఆమె బృందానికి నేను రుణపడి ఉంటాను. డాక్టర్ ఈశ్వర్, డాక్టర్ వెల్లు ముర్గన్ మాతృత్వంలో కూడా సహాయం చేశారు’’ అంటూ ఎమోషన్ అయ్యింది నమిత. నమిత పండంటి బిడ్డలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

  Last Updated: 20 Aug 2022, 11:58 AM IST