Site icon HashtagU Telugu

Nagma: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరోయిన్ నగ్మా.. నెట్టింట ఫొటోస్ వైరల్?

Mixcollage 19 Feb 2024 08 49 Am 6038

Mixcollage 19 Feb 2024 08 49 Am 6038

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట హిందీలో బాగి అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. 90 లలో వరుసపెట్టి సినిమాలు చేసిన నగ్మా 2008 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. తెలుగులో చాలా సినిమాలలో నటించింది నగ్మా. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవితో ఘరానా అల్లుడు, నాగార్జునతో అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్‌లో మోహన్ బాబుకి జోడీగా నటించారు.

ప్రభుదేవాతో తమిళంలో నటించిన కాదలన్ తెలుగులో ప్రేమికుడు గా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అలా తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో పాటు భోజ్‌పురిలో కూడా అనేక సినిమాల్లో నటించారు నగ్మా. ఇకపోతే ప్రస్తుతం నగ్మా సినిమాలకు పూర్తి దూరంగా ఉంటోంది. ఇటీవలే నగ్మా కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలు నగ్మా అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఒక క్షణం ఆ వీడియోని చూసినా అభిమానులు ఒకప్పటి హీరోయిన్ నగ్మా నేనా అన్న విధంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

చాలా లావు అయిపోయిముఖం అంతా కూడా చాలా లావుగా ఉంది గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. చాలామంది ఆ వీడియో పై నెగిటివ్గా కూడా కామెంట్స్ చేశారు. నగ్మా సినిమాలకు దూరంగా ఉండి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతోంది. బాగా బొద్దుగా కనిపిస్తున్న నగ్మా వయసు 48 సంవత్సరాలు. అయితే అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్
అవ్వడంతో అదేంటి హీరోయిన్ నగ్మా అలా మారిపోయింది. ఏదైనా సమస్యతో బాధపడుతోందా మరి అంత లావు అయిపోయిందేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version