Meera Chopra: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన పవన్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్?

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కొందరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు పెద్దలు కు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 13 Mar 2024 04 39 Pm 7480

Mixcollage 13 Mar 2024 04 39 Pm 7480

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కొందరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు పెద్దలు కుదిర్చిన సంబంధంతో పెళ్లి చేసుకుంటున్నారు. అలా మొత్తానికి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా కూడా మరొక హీరోయిన్ మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఆమె మరెవరో కాదు మీరా చోప్రా. తమిళ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన మీరా చోప్రా సెకండ్ మూవీ పవన్ కళ్యాణ్ తో చేసి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు.

బంగారం సినిమాలో నటించిన మీరా చోప్రా.. ఆ తరువాత వాన, మారో, గ్రీకువీరుడు సినిమాల్లో నటించారు. తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించిన ఈ హీరోయిన్ ముంబైకి చెందిన రక్షిత్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్తతో గత మూడేళ్ళుగా ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు అన్నింటిని నిజం చేస్తూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. జైపూర్ లోని బ్యూనా విస్తా లగ్జరీ గార్డెన్ రిసార్ట్స్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. మార్చి 11, 12 తేదీలలో రెండు రోజుల సంబరంగా వివాహం జరిగింది.

కేవలం కుటుంబసభ్యులు, పలువురు బంధుమిత్రుల సమక్షంలోనే మీరా చోప్రా ప్రియుడు రక్షిత్ కేజ్రీవాల్ తో ఏడడుగులు వేశారు. ఇక ఈ పెళ్లి సందడి పూర్తి అవ్వడంతో మీరా అండ్ రక్షిత్ తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. గొడవలు, కన్నీళ్లు, నవ్వులు, సంతోషం, జీవితాంతం సరిపోయే జ్ఞాపకాలు అంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేసుకొచ్చారు.

  Last Updated: 13 Mar 2024, 04:40 PM IST