Mamta Mohandas: స్పోర్ట్స్ కారు కొన్న ఒకప్పటి హీరోయిన్.. ఇన్నాళ్లకు ఇలా దర్శనమిచ్చిందా అంటూ?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు కోట్లు లక్షలు విలువ చేసే లగ్జరీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అలా తాజాగా కూడ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 10 Feb 2024 07 54 Am 5969

Mixcollage 10 Feb 2024 07 54 Am 5969

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు కోట్లు లక్షలు విలువ చేసే లగ్జరీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అలా తాజాగా కూడా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒక లగ్జరీ కారును కొనుగోలు చేసింది. అంతేకాకుండా చాలా కాలంగా సోషల్ మీడియాకు సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న ఆమె ఈ కారు కొనుగోలు చేస్తూ చాలా రోజులకు అభిమానులకు దర్శనమిచ్చింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఎలాంటి కారు కొనుగోలు చేసింది? అన్న వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన భామల్లో మమతామోహన్ దాస్ ఒకరు. ముఖ్యంగా యమదొంగ సినిమా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఈ సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్న మమతా మోహన్ దాస్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా ఆమె మనందరికీ సుపరిచితమే. ఆమె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు మమతా మోహన్ దాస్.తెలుగులో కృష్ణార్జున, విక్టరీ, చింతకాయల రవి, కింగ్‌, కేడి ఇలా అనేక సినిమాలు చేసింది. కానీ అవేమి ఈ చిన్నదానికి సక్సెస్ తెచ్చిపెట్టలేదు. ఒక తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళం కన్నడ భాషల్లో కూడా నటించింది. అలాగే మలయాళ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ కొత్త కారు కొనుగోలు చేసింది. బీఎమ్‌డబ్ల్యూ Z4 M40i స్పోర్ట్స్‌ కారు కొనుగోలు చేసింది. ఇందుకు సంబందించిన ఫోటోస్,వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోస్ ని చూసిన అభిమానులు నెటిజన్స్ మమతాకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే చాలా కాలం తర్వాత ఇలా స్పోర్ట్స్ కారు కొనుగోలు చేస్తూ మమతా మోహన్ దాస్ అభిమానులకు కనిపించడంతో ఇన్నాళ్లకు దర్శనమిచ్చిందిగా అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.

  Last Updated: 10 Feb 2024, 07:55 AM IST