Laya : టాలీవుడ్ హీరోయిన్ లయ ‘స్వయంవరం’ సినిమాతో నటిగా కెరీర్ ని స్టార్ట్ చేసారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న లయ.. వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు కదిలారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ వచ్చారు. అయితే 2006లో పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమయ్యారు. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి కాలిఫోర్నియాలో ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ వచ్చారు. లయకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
లయ చివరిగా ‘బ్రహ్మలోకం టు యమలోకం వయ భూలోకం’ సినిమాలో కనిపించారు. ఇక ఇన్నాళ్లు సినిమా రంగానికి దూరంగా ఉన్న లయ.. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ మొహానికి రంగు పూసుకొని ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ఒకటి రెండు సినిమాలకు సైన్ చేసి షూటింగ్ కూడా జరుపుతూ వస్తున్నారు. ఇక లయ రీ ఎంట్రీ ఇవ్వడంతో.. పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో లయ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్ లంటే చాలా ఇష్టమని.. ఆ ఇంటర్వ్యూలో లయ చెప్పుకొచ్చారు. ఎందుకు ఆ స్పీచ్స్ అంటే ఇష్టమని ప్రశ్నించగా, లయ బదులిస్తూ.. “రాజకీయ నాయకులు ఇచ్చే స్పీచ్ లు కొంచెం టిపికల్ గా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లు అలాగా ఉండవు. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మా యాక్టర్స్ రోజా గారి లాంటి వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్ లా మాట్లాడుతుంటారు. కానీ పవన్ గారు మాత్రం అలా కాకుండా.. నిజాయితీగా, తనకి అనిపించింది మాట్లాడతారు. ఒకర్ని ఆకట్టుకోవాలని ఎప్పుడు మాట్లాడారు. అది నన్ను బాగా ఆకట్టుకుంటుంది” అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Actress laya garu rocks Paytm Kukka Swapna shocks 🥰🥰 pic.twitter.com/lLHQzOEgTB
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) May 18, 2024