Site icon HashtagU Telugu

Keerthi Suresh Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేష్

Keerthi Tirumala

Keerthi Tirumala

మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ (Keerthi Suresh )..శుక్రవారం ఉదయం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహానటి మూవీ తో ఎంతో పేరు , ప్రతిష్టలు సంపాదించుకున్న కీర్తి సురేష్.. నిర్మాత జి. సురేష్ కుమార్‌, నటి మేనకల కుమార్తె కీర్తి. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది.14 నవంబర్ 2013లో వచ్చిన మలయాళ సినిమా ‘గీతాంజలి’తో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.

తెలుగు ,తమిళ్ తో పాటు మలయాళంలో సినిమాలు చేస్తూ కీర్తి పేరు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా తెలుగులో డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేసిన మహానటి మూవీ అమ్మడికి ఎంతో పేరు తీసుకురావడమే కాదు ఎన్ని అవార్డ్స్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత సినీ జనాలంతా కీర్తి ప్రేవు జపం చేసారు. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టినప్పటికీ అవన్నీ ప్లాప్స్ అయ్యేసరికి మహానటి తో వచ్చిన గుర్తింపు అంత పోయింది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, సామీ స్క్వేర్, పందెం కోడి 2 ,అన్నాతే… ఇలా ఆరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అవ్వడంతో కీర్తి సురేష్ కెరీర్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అమ్మడు లావు తగ్గి స్లిమ్ అయ్యి కంప్లీట్ కొత్త లుక్ లోకి రావడమే కాదు అందాల ఆరబోతకు కూడా సై అనేసింది. దీంతో అభిమానులంతా ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది.

తాజాగా కీర్తి సురేష్ తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టింది. 15 ఏళ్లు ఇంకా కొనసాగుతుంది అంటూ ఆంటోనీ కీర్తి ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 15 ఏళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. కీర్తి ఆంటోని మ్యారేజ్ డిసెంబర్ 11, 12 తారీఖుల్లో గోవాలో జరగబోతుంది. కీర్తి సురేష్ ఆంటోని కాలేజ్ డేస్ నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయమే ప్రేమగా మారి ఆమె కెరీర్ కు అండగా నిలబడింది. ఆంటోని (Anthony) ఒక బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది. అంతకుముందు దుబాయ్ లో ఉన్న అతను ప్రస్తుతం కొచిలో బిజినెస్ మెన్ గా కొనసాగుతున్నారు.

Read Also : The Disaster Management (Amendment) Bill : నేడు లోక్ సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా