Site icon HashtagU Telugu

Bollywood: 44 ఏళ్ళ వయసులో జిమ్‏లో కష్టపడుతూ చెమటలు చిందిస్తున్న హీరోయిన్.. ఫొటోస్ వైరల్!

Bollywood

Bollywood

మామూలుగా తయారు చేసే సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అభిమానులు కూడా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. టాలీవుడ్ సెలబ్రిటీల సంగతి పక్కన పెడితే బాలీవుడ్ లో సెలబ్రిటీలు బయట కనిపించినా, జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఇలా ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అలా తాజాగా కూడా బాలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోయిన్ ఫొటోస్ వైరల్ గా మారాయి.

ఆమె జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పైన ఫోటోలో అర్జున్ లో వర్క్ అవుట్ లు చేస్తూ కనిపిస్తున్న నటి బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని కూడా ని పరుచుకుంది. 44 ఏళ్ల వయసులో కూడా ఇంకా యంగ్ గా కనిపిస్తూ తన అందంతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత మనకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

 

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అని అనుకుంటున్నారా ఆమె మరెవరో కాదండోయ్ కరీనాకపూర్. ఈ ముద్దుగుమ్మ కి ఫిట్నెస్ పై ఎంత ఆసక్తి ఉందో మనందరికీ తెలిసిందే. గతంలో కూడా వర్కౌట్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా కూడా సోషల్ మీడియాలో ఈమె జిమ్ లో చెమటలు చిందిస్తున్న ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి. ఆ వీడియోలో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ కరీనా ఎంతో కష్టపడుతోంది. 44 ఏళ్ల వయసులో కూడా ఇలా కష్టపడుతూ హెవీ వర్కౌట్ చేస్తూ ఎంతోమందికి ఇన్స్పైర్గా నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. దీనిని బట్టి చూస్తే ఆమె ఫిట్నెస్ పై ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అర్థమవుతోంది. ఆ ఫొటోస్ వీడియోస్ ఫై అభిమానులు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.