Jyotika-Surya: విడాకుల వార్తలు చెక్ పెట్టేసిన జ్యోతిక.. ఆ వీడియో షేర్ చేయడంతో?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తమిళ హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అందుకే గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నార

Published By: HashtagU Telugu Desk
Mixcollage 30 Jan 2024 05 21 Pm 2468

Mixcollage 30 Jan 2024 05 21 Pm 2468

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తమిళ హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అందుకే గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు అంటూ అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. భిన్న మతాలు, కులాలకు చెందిన ఈ జంట మధ్య అద్భుతమైన బంధం ఉంది. అయితే ఇటీవల వీరికి సంబంధించి విడాకుల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అలాంటి పుకార్లకు ఒక వీడియో ద్వారా జ్యోతిక ముగింపు పలికింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్తలు విని విని విసిగిపోయిన జ్యోతిగా ఎట్టకేలకు ఈ వార్తలపై స్పందించింది.

ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను కూడా విడుదల చేసింది. కాగా ఇటీవల సూర్య జ్యోతిక దంపతులు ఫిన్లాండ్ టూర్ కి వెళ్లారు. తాజాగా ఆ పర్యటన వీడియోని 2024 – (A year full of travel ప్రయాణంతో నిండిన సంవత్సరం అనే క్యాప్షన్ తో ఈ వీడియోని జ్యోతిక పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఈ స్టాక్ కపుల్ హాలిడే ట్రిప్ ని కలిసి బాగా ఎంజాయ్ చేయడం చూడవచ్చు. ఈ వీడియో ద్వారా తమ గురించి వస్తున్న పుకార్లు కేవలం పుకార్లు మాత్రమే, అందులో ఏ మాత్రం నిజం లేదని, తమ బంధం ఎంత గట్టిగా ఉంది అని ఆ వీడియోతో చెప్పకనే చెప్పేసింది జ్యోతిక.

 

ఇక జ్యోతిక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే సూర్య జ్యోతిక ఇద్దరూ ప్రస్తుతం పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవలె జ్యోతిక బాలీవుడ్ నుండి అనేక ఆఫర్లు రావడంతో ఆమె తాత్కాలికంగా తన స్థావరాన్ని మార్చుకుంది. తన పిల్లలు ముంబైలో వారి చదువులు కొనసాగిస్తున్నారని, కాబట్టి ఉద్యోగం,వ్యక్తిగత జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ఈ బదిలీ ఆచరణాత్మక నిర్ణయమని జ్యోతిక తెలిపింది. తన బాలీవుడ్ కమిట్‌మెంట్‌లు పూర్తయిన తర్వాత చెన్నైకి తిరిగి రావాలని ఆలోచిస్తున్నట్లు జ్యోతిక అభిమానులకు హామీ ఇచ్చింది.

  Last Updated: 30 Jan 2024, 05:24 PM IST