Site icon HashtagU Telugu

Ileana : రెండోసారి తల్లి కాబోతున్న ఇలియానా..

Actress Ileana D Cruz Announced Second Pregnancy

Ileana

Ileana : గతంలో తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో మొదటిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డ్ కూడా సెట్ చేసింది ఇలియానా. కానీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. విదేశాలకు చెందిన మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని ఇలియానా పెళ్లి చేసుకొని గత సంవత్సరం ఒక బాబుకి జన్మనిచ్చింది.

ఇలియానా బాబు పుట్టేదాకా కూడా తన భర్తని ఎవ్వరికి పరిచయం చేయలేదు. ఇక బాబు పుట్టాక అతని పేరు ఫీనిక్స్ డోలన్ అని ప్రకటించి అప్పుడప్పుడు తన బాబు ఫోటోలు షేర్ చేస్తుంది. ఇప్పటికే ఇలియానా బాబుకి ఫస్ట్ బర్త్ డే కూడా చేసింది. అయితే తాజాగా ఇలియానా రెండోసారి తల్లి కాబోతుందని తెలుస్తుంది. నిన్న న్యూ ఇయర్ సందర్భంగా గత సంవత్సరం స్పెషల్ మూమెంట్స్ ని ఒక వీడియోలాగ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇలియానా.

ఈ వీడియోలో అక్టోబర్ నెలలో తాను మరోసారి ప్రగ్నెన్సీ అయినట్టు ప్రగ్నెన్సీ టెస్టర్ తో చూపించింది. దీంతో ఇలియానా మరోసారి తల్లి కాబోతుందని క్లారిటీ వచ్చింది. ఈ వీడియో వైరల్ గా మారగా ఇలియానాకు కంగ్రాట్స్ చెప్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

 

Also Read : Fish Venkat : ఫిష్ వెంకట్ కు సహాయం చేసిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ అవుతూ థ్యాంక్స్ చెప్పిన వెంకట్.. వీడియో వైరల్..