Hari Prriya : కన్నడ, తెలుగు హీరోయిన్ హరిప్రియ తాజాగా తల్లి అయింది. పండంటి బాబుకి జన్మనిచ్చింది. 2023 జనవరిలో హరిప్రియ నటుడు వసిష్ఠ సింహని పెళ్లి చేసుకుంది. గత సంవత్సరం తన ప్రగ్నెన్సీని ప్రకటించింది ఈ భామ. తాజాగా తమ వెడ్డింగ్ డేనే తమకు బాబు పుట్టాడని హరిప్రియ – వసిష్ఠ సింహ కలిసి ప్రకటించారు. అంటే నిన్న జనవరి 26నే వీరికి బాబు పుట్టాడని ప్రకటించారు.
ఓ సింహం ఫ్యామిలీ ఉన్న క్యూట్ ఫోటో షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కన్నడలో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హరిప్రియ తెలుగులో పిల్ల జమిందార్, జయసింహ, ఈ వర్షం సాక్షిగా, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్.. లాంటి పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం కూడా కన్నడలో పలు సినిమాలు చేస్తుంది ఈ భామ. తెలుగు, కన్నడ సినిమాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసే నటుడు వసిష్ఠ సింహాని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Also Read : Bunny Vas : అల్లు యూనివర్సిటీ.. అల్లు అరవింద్ డీన్.. బన్నీ క్లోజ్ ఫ్రెండ్ స్పెషల్ ట్వీట్..