Site icon HashtagU Telugu

Faria Abdullah : డ్యాన్స్ షో జడ్జిగా మారిన హీరోయిన్.. ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2..

Actress Faria Abdullah Turned as Judge in Aha OTT Dance Icon Season 2 Show

Faria Abdullah

Faria Abdullah : డ్యాన్స్ షోలకు డ్యాన్స్ మాస్టర్స్ ని మాత్రమే కాకుండా కాస్త బ్యూటీ ఉండటానికి హీరోయిన్స్ ని జడ్జీలుగా పెడతారని తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్ హీరోయిన్స్ జడ్జీలుగా అనేక టీవీ షోలలో కనిపిస్తున్నారు. కానీ ప్రస్తుతం సినిమాలు చేస్తున్న యువ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా డ్యాన్స్ షోకి జడ్జ్ గా మారడం ఆసక్తిగా మారింది.

తెలుగు ఓటీటీ ఆహాలో రెగ్యులర్ గా కొత్త షోలు, సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. కొన్ని షోలకు సీజన్స్ కంటిన్యూ చేస్తున్నారు. గతంలో ఆహా ఓటీటీలో చేసిన డ్యాన్స్ ఐకాన్ షోకి ఇప్పుడు సీజన్ 2 రానుంది. ఓంకార్ యాంకర్ గా డ్యాన్స్ మాస్టర్ శేఖర్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జడ్జిలుగా ఈ షోకి రానున్నారు.

ప్రస్తుతం ఈ షో షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ అనే పేరుతో ఆహా ఓటీటీలో ఈ డ్యాన్స్ షో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో దేశం నలుమూలల నుంచి కంటెస్టెంట్స్ వస్తున్నారు. ఫరియా కూడా ఒక డ్యాన్సర్. మరి షోలో ఫరియా జడ్జిగా, మధ్యమధ్యలో తన డ్యాన్సులతో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

 

Also Read : Daaku Maharaj Success Meet: అనంత‌పురంలో డాకు మ‌హారాజ్ స‌క్సెస్ మీట్‌.. ఎప్పుడంటే?