Daksha Nagarkar: హీరోయిన్ కాళ్లపై అలాంటి కామెంట్స్ చేసిన నెటిజెన్.. దిమ్మతిరిగే విధంగా ఆన్సర్ ఇచ్చిన నటి?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు అభిమానులకు ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోయింది. దీంతో సెలబ్రిటీలు ప్ర

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 12:30 PM IST

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు అభిమానులకు ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోయింది. దీంతో సెలబ్రిటీలు ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకోడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అభిమానులు కూడా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను చాలా ఈజీగా తెలుసుకోగలుగుతున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఎదురయ్యే ప్రశ్నల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల గురించి కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా చాలామంది ప్రశ్నిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు.

కొందరు అలాంటి ప్రశ్నలను స్కిప్ చేస్తే మరి కొందరు అలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెబుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ కి ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయని చెప్పవచ్చు. హీరోయిన్లకు సంబంధించిన పర్సనల్ లైఫ్, లవ్ , మ్యారేజ్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు నెటిజన్స్. అప్పుడప్పుడు హీరోయిన్లు కూడా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు. అటువంటి క్రమంలోనే ఊహించని ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అందులో కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. అలాగే హీరోయిన్స్ ఇచ్చే ఆన్సర్స్ కూడా నెట్టింట కాంట్రవర్సీ అవుతుంటాయి.

ఇక కొందరు ముద్దుగుమ్మలు మాత్రం తమ గురించి అడియన్స్ వేసే కామెంట్లను ఫన్నీగానే తీసుకుంటారు. తాజాగా హీరోయిన్ ధక్ష నగర్కర్ కూడా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఒక అభిమానికి ఫన్నీగా రిప్లై ఇచ్చింది. తాజాగా నెట్టింట అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది ధక్ష. అందులో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ దక్షకు పిచ్చి ప్రశ్న వేశాడు. మీ తొడలంటే నాకు చాలా ఇష్టం. నేను వాటికి ఫ్యాన్.. సీక్రెట్ ఏంటో చెప్పండి అని కామెంట్స్ చేసాడు. ఆ కామెంట్స్ పై స్పందించిన దక్ష ఫన్నీగా రిప్లై ఇస్తూ.. తొడలు ఎందుకు బాగున్నాయ్ అంటే నేను మసాలా వడలు తింటాను కాబట్టి అంటూ నవ్వుతున్న ఎమోజీస్ షేర్ చేసింది. ఇక దక్ష స్పాంటేనిటి, స్పోర్టివ్ నెస్ చూసి నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.