Site icon HashtagU Telugu

Anushka Shetty: మలయాళ మూవీకి గ్రీన్ సిగ్నలిచ్చిన స్వీటీ.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Mixcollage 14 Mar 2024 01 04 Pm 8738

Mixcollage 14 Mar 2024 01 04 Pm 8738

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది అనుష్క. అక్కినేని హీరో నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఆమె అందానికి ప్రతి ఒక్కరు కూడా మంత్ర ముగ్దులు అవ్వాల్సిందే. ఇవి సినిమాలో నటనకు గాను మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ , రెండు నంది అవార్డులు, రెండు SIIMA అవార్డులు కూడా అందుకుంది.

ఆ తర్వాత ఆ రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమాతో అనుష్క క్రేజ్ భారీగా పెరిగింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అనుష్క. 2009లో అనుష్క శెట్టి తెలుగు డార్క్ ఫాంటసీ చిత్రం అరుంధతిలో ద్విపాత్రాభినయం చేసింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది అనుష్క. అలాగే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అనుష్క ఈ మధ్యకాలంలో సినిమాలు పూర్తిగా తగ్గించేసింది.

ఇటీవల నవీన్ పొలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో హిట్ అందుకుంది ఈ చిన్నది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో అనుష్క మళ్లీ సినిమాల్లో బిజీ బిజీ అవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇపుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది అనుష్క. కథనార్‌- ద వైల్డ్‌ సోర్సరర్‌ అనే థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు రాజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం అనుష్క ఏకంగా రూ.5-6 కోట్లు డిమాండ్‌ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.