Anjali : శ్రీలీల వరుస సినిమాలు చేస్తుంది.. మీరేమో? అంటూ పోల్చడంతో ఫైర్ అయిన అంజలి..

మీడియా వ్యక్తి అలా కాదు ఇప్పుడు వచ్చిన శ్రీలీల(Sreeleela) వరుసగా సినిమాలు చేస్తుంది. మీరేమో.. అని అంటుండగానే అంజలి కొంచెం సీరియస్ గా రిప్లై ఇచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Actress Anjali fires on Media for Comparing her with Sreeleela

Actress Anjali fires on Media for Comparing her with Sreeleela

తెలుగమ్మాయి అంజలి(Anjali) తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా సినిమాలు చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా అంజలి సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఇప్పటికి కూడా చిన్న సినిమాలు, సినిమాల్లో సెకండ్ హీరోయిన్, ఐటెం సాంగ్స్ చేస్తుంది. గతంలో అంజలి మెయిన్ లీడ్ లో చేసిన హారర్ కామెడీ సినిమా గీతాంజలి(Geethanjali) మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు ఇటీవల సీక్వెల్ ప్రకటించారు.

కోన వెంకట్ నిర్మాణంలో శివ తుర్లపాటి దర్శకత్వంలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో అంజలితో సహా చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. ఫస్ట్ లుక్ లాంచ్ అనంతరం మీడియాతో ముచ్చటించారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు చిత్రయూనిట్.

అయితే ఓ మీడియా ప్రతినిధి అంజలిని.. మీరు తెలుగు వారు, చాలా సినిమాలు చేశారు. మీరంటే నాకు కూడా అభిమానమే. అయినా ఇంతవరకు మీకు సరైన బ్రేక్ ఎందుకు రాలేదు అనిపించిందా? తెలుగమ్మాయి అవ్వడం వల్లే రాలేదా? అని అడగడంతో బ్రేక్ రాకపోతే మీరు నన్ను ఎలా అభిమానిస్తారు అని అడిగింది అంజలి.

అయితే సదరు మీడియా వ్యక్తి అలా కాదు ఇప్పుడు వచ్చిన శ్రీలీల(Sreeleela) వరుసగా సినిమాలు చేస్తుంది. మీరేమో.. అని అంటుండగానే అంజలి కొంచెం సీరియస్ గా రిప్లై ఇచ్చింది. అంజలి ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ.. నేనెప్పుడూ టాప్ స్థానాల కోసం పోటీ పడలేదు. ఒక్కొక్కరికి ఒక్కో హీరోయిన్ నచ్చుతారు. నాకు స్క్రిప్ట్ నచ్చితేనే, అందులో నా పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటాను. నేను కూడా ఒకేసారి నాలుగు సినిమాలు చేయొచ్చు. కానీ నాలుగు సినిమాలకు బదులు ఒక మంచి సినిమా చేయాలని భావిస్తాను. నేను తెలుగుతో పాటు సౌత్ లో మిగిలిన మూడు భాషల్లో కూడా నటిస్తున్నాను. ఒకేసారి అన్నిచోట్లా ఉండటం కుదరదు కదా. అక్కడో సినిమా, ఇక్కడో సినిమా చేస్తున్నాను. నాకు కిక్కిచ్చే పాత్రలే చేస్తాను అని సమాధానమిచ్చింది. దీంతో శ్రీలీలతో తనని పోల్చడంపై సీరియస్ అయి అంజలి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

Also Read : Guntur Kaaram Trailer : గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్.. సంక్రాంతికి ఘాటెక్కిస్తున్న బాబు..

  Last Updated: 07 Jan 2024, 09:31 PM IST