Site icon HashtagU Telugu

Amala Paul: అభిమానులకు శుభవార్త చెప్పిన అమలాపాల్.. నెట్టింట ట్వీట్ వైరల్?

Amala Paul 3

Amala Paul 3

హీరోయిన్ అమలాపాల్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా సందర్భాలలో ఆమె ప్రేమ పెళ్లి విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ లోనూ సినిమాలు చేసి హీరోయిన్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్. కాగా ఈమె ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

గోవాకి చెందిన జగత్‌ దేశాయ్‌ని అమలా పాల్‌ కొద్ది నెలల క్రితం పెళ్లి చేసుకుంది. అక్టోబర్‌లో ప్రియుడిని పరిచయం చేసిన అమలా పాల్‌ నవంబర్‌లో పెళ్లి చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఎక్కువగా బేబీ బంప్ తో ఫోటోలకు ఫోజులిస్తూ తరచూ భర్తతో కలిసి వెకేషన్ లకు తిరుగుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా అమల పాల్ సోషల్ మీడియాలో ఒక క్రేజీ పోస్ట్ షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ అమలా పాల్ త్వరలోనే కవల పిల్లలను కనబోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

 

ఇక ఇప్పుడు కవల పిల్లలను కనబోతుందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఫ్యాన్స్ ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా అమలా పాల్ ఓ చిన్న పాపను ఎత్తుకొని టూ హ్యాపీ కిడ్స్ అనే క్యాప్షన్ ఇచ్చింది. దాంతో అమలాపాల్ త్వరలోనే కవలలకు జన్మనివ్వనుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు అమలాపాల్ నిజంగానే కవలలకు జన్మనివ్వనుందా? అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.