Site icon HashtagU Telugu

Aishwarya Rajesh: ఆ దర్శకుడిని ఉద్దేశిస్తూ అలాంటి ట్వీట్ చేసిన ఐశ్వర్య రాజేష్.. తెలుసుకొని మాట్లాడండి అంటూ?

Mixcollage 31 Jan 2024 01 00 Pm 5780

Mixcollage 31 Jan 2024 01 00 Pm 5780

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ఈమె వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలె మలయాళంలో పులిమడ అనే ఒక చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. 2018లో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిందీ. అంతకు ముందు చాలా తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.

ఇక తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేసింది ఐశ్వర్య. విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫెమస్ లవర్, నాని తో టక్ జగదీశ్, సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించింది ఐశ్వర్య రాజేష్. ఈ సినిమాలన్నీ నిరాశపరిచినప్పటికీ ఐశ్వర్య రాజేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కాగా ఐశ్వర్య ప్రస్తుతం తమిళ్ సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అయితే ఈ మధ్య ఐశ్వర్య రాజేష్ పై ఒక దర్శకుడు సంచలన కామెంట్స్ చేశారు. తమిళ్ దర్శకుడు వీరపాండియన్ ఐశ్వర్య రాజేష్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను డైరెక్ట్ చేసిన సినిమాతోనే ఐశ్వర్య రాజేశ్‌ పరిచయం అయ్యింది..

 

ఆ విషయం ఆమె ఎక్కడా కూడా చెప్పలేదు. ఇప్పుడు స్టార్ డమ్ రావడంతో నాతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఒకప్పుడు ఆమెకు ఆటోకు కూడా డబ్బులు లేకపోతే నేనే ఇచ్చాను అంటూ షాకింగ్ విషయాలు తెలిపారు. తాజాగా ఆ వాఖ్యలపై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ.. ఆయన పేరు ఎత్తకుండా ఒక ట్వీట్ చేశారు. చాలా మంది ఒక వైపే విని మాట్లాడుతూ ఉంటారు. అసలు విషయాలు తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చి జీవితంలోని అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే.. పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అని రాసుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. అయితే ఐశ్వర్య పరోక్షంగా వీరపాండ్యన్ నే టార్గెట్ చేసి ఆ ట్వీట్ చేసిందని అంటున్నారు కొందరు నెటిజన్స్.

Exit mobile version