Vishal Wedding : హీరో విశాల్ తో ఏడడుగులు వేయబోతున్న హీరోయిన్ ..?

Vishal Wedding : గతంలో విశాల్ వివాహం విషయంలో వరలక్ష్మి శరత్‌కుమార్, అభినయ వంటి నటీమణుల పేర్లు వినిపించినా అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. హైదరాబాద్‌కు చెందిన అనీషాతో నిశ్చితార్థం జరిగి, తర్వాత విరమించుకోవాల్సి వచ్చిన విషయం కూడా తెలిసిందే

Published By: HashtagU Telugu Desk
Vishal Dhansika

Vishal Dhansika

తమిళ సినీ నటుడు విశాల్ పెళ్లి (Vishal Wedding) గురించి మరోసారి వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల విశాల్ మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. తన జీవిత భాగస్వామిని ఇప్పటికే ఎంపిక చేసుకున్నానని, ఇది ప్రేమ వివాహమేనని కూడా తెలిపారు. ఇక ఇప్పుడు సాయి ధన్సిక (Dhansika) ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు తమిళ మీడియా వర్గాల్లో గట్టిగా ప్రచారం అవుతున్నాయి. దీంతో విశాల్ అభిమానుల్లో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

Bad Breath: ఏమి చేసిన నోటి దుర్వాసన పోవడం లేదా.. అయితే వెంటనే ఇలా చేయండి!

విశాల్, సాయి ధన్సికలు కొంతకాలంగా ఒకరికొకరు దగ్గరవుతున్నట్లు సమాచారం. వారి ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి ఆమోదం లభించిందని, త్వరలోనే పెళ్లి తేదీని ఖరారు చేయనున్నారని చెన్నై మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ జంట పెళ్లిపై ఇప్పటికే పలు ఆంగ్ల పత్రికలు కథనాలు ప్రచురించగా, సోషల్ మీడియాలోనూ ఈ వార్తలు తెగ వైరలవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు విశాల్ గానీ, సాయి ధన్సిక గానీ అధికారికంగా స్పందించలేదు.

ఇదిలా ఉండగా గతంలో విశాల్ వివాహం విషయంలో వరలక్ష్మి శరత్‌కుమార్, అభినయ వంటి నటీమణుల పేర్లు వినిపించినా అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. హైదరాబాద్‌కు చెందిన అనీషాతో నిశ్చితార్థం జరిగి, తర్వాత విరమించుకోవాల్సి వచ్చిన విషయం కూడా తెలిసిందే. సాయి ధన్సిక విషయానికొస్తే.. ఆమె తమిళ చిత్రాలతో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇప్పుడు ఈ జంట పెళ్లిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

  Last Updated: 19 May 2025, 07:56 PM IST