Operation Sindoor : విజయ్ దేవర ‘కొండంత’ మనసు

Operation Sindoor : "మన దేశం మనకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు మనం దేశానికి తిరిగి ఇచ్చే సమయం వచ్చింది" అని పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Vijay Donation

Vijay Donation

భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు (India – Pakistan War) నెలకొన్న ఈ పరిస్థితుల్లో తెలుగు సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తన గొప్ప మనసును చాటుకున్నారు. దేశ రక్షణలో ఉన్న భారత సాయుధ బలగాలకు తనవంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. తనకు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ ‘రౌడీ వేర్’ (Rowdy Wear) ద్వారా వచ్చే ఆదాయంలో నుంచి కొంత డబ్బు ను భారత సైన్యం కోసం విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తన పుట్టినరోజు రోజునే ఈ గొప్ప ప్రకటన చేయడం గమనార్హం.

Warning : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

ఈ సందర్బంగా విజయ్ (Vijay) ఓ వీడియో ద్వారా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ .. “మన దేశం మనకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు మనం దేశానికి తిరిగి ఇచ్చే సమయం వచ్చింది” అని పేర్కొన్నారు. ఇది ఒక్క అనుభూతి కాదు, బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత సైన్యం చేసే త్యాగాల పట్ల తన గౌరవం వ్యక్తం చేస్తూ, వారికి తనవంతుగా నైతికంగా, ఆర్థికంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. విజయ్ ఈ ప్రకటనతో తన దేశభక్తిని మరోసారి చాటుకున్నారు.

విజయ్ దేవరకొండ చేసిన ఈ ప్రకటన అభిమానుల్లో కాకుండా, సమాజంలో దేశభక్తిని పెంచేలా ఉంది. యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సినీ రంగానికి చెందినవారు ఇలా దేశానికి అండగా నిలవడం అభినందనీయం. విజయ్ తరహా సహాయాలు భారత సాయుధ బలగాలకు మానసికంగా, ఆర్థికంగా మద్దతుగా నిలుస్తాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “రౌడీ” అని పిలవబడే విజయ్ దేవరకొండ ఈసారి తన ‘కొండంత మనసు’తో నిజంగా హీరోగా నిలిచారు.

  Last Updated: 09 May 2025, 08:37 PM IST