Thiruveer : పెళ్లి పీటలు ఎక్కిన ‘మాసూద’ హీరో.. వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు..

కల్పనా రావు అనే అమ్మాయితో నేడు తిరువీర్ వివాహం జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Actor Thiruveer Married Kalpana Rao Wedding Photos goes Viral

Actor Thiruveer Married Kalpana Rao Wedding Photos goes Viral

Thiruveer : థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన తిరువీర్ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు సినిమాల్లో మెప్పించిన తిరువీర్ అనంతరం మాసూద సినిమాతో ఒక్కసారిగా హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తిరువీర్, కావ్య జంటగా హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన మాసూద సినిమా పెద్ద హిట్ అవ్వడంతో తిరువీర్ కి హీరోగా కూడా అవకాశాలు మొదలయ్యాయి.

మాసూద తర్వాత పరేషాన్ సినిమాతో పర్వాలేదనిపించారు. ప్రస్తుతం తిరువీర్ చేతిలో నాలుగు సినిమాలు హీరోగా ఉన్నట్టు సమాచారం. తాజాగా ఓ సంతోషకరమైన వార్త పంచుకున్నాడు. తిరువీర్ ఓ ఇంటివాడయ్యాడు. కల్పనా రావు అనే అమ్మాయితో నేడు తిరువీర్ వివాహం జరిగింది.

ఎలాంటి హడావిడి లేకుండా కేవలం బంధుమిత్రులు, సన్నిహితుల మధ్యే సింపుల్ గా వీరి వివాహం జరిగింది. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొత్త జీవితం ప్రారంభమైంది అంటూ పోస్ట్ చేసాడు. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తిరువీర్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Also Read : Chandini Chowdary : కమర్షియల్ హీరోయిన్ ఛాన్సులు రావడానికి ఇంకెంత ప్రూవ్ చేసుకోవాలి..? చాందిని సంచలన వ్యాఖ్యలు..

  Last Updated: 21 Apr 2024, 08:07 PM IST