Site icon HashtagU Telugu

Hanuman: హనుమాన్‌ కోసం 75 సినిమాలను సినిమాలను రిజెక్ట్ చేశాను.. తేజా సజ్జా కామెంట్స్ వైరల్?

Mixcollage 05 Feb 2024 07 59 Am 190

Mixcollage 05 Feb 2024 07 59 Am 190

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా గురించి మనందరికీ తెలిసిందే. తేజా తాజాగా నటించిన చిత్రం హనుమాన్. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ను అందుకోవడంతో పాటు వసూళ్ల సునామీని సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 270 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ప్రస్తుతం హీరో తేజ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అందులో భాగంగానే తాజాగా తేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హనుమాన్ సినిమా కోసం తాను పడ్డ కష్టాల గురించి వివరించారు తేజా సజ్జా. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా తేజ మాట్లాడుతూ.. హనుమాన్ సినిమా పనులు పూర్తి చేయడానికి రెండున్నరేళ్లు పట్టింది. ఈ సమయంలో వేరే సినిమాల గురించి అసలు దృష్టి పెట్టలేదు. నాకు ఇతర అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో నేను దాదాపు 70 నుండి 75 ప్రాజెక్ట్‌ లను రిజెక్ట్ చేశాను. అందులో కనీసం 15 ప్రాజెక్టులు బాగున్నాయి. అయితే హనుమాన్ సినిమాకు పూర్తిగా కమిట్ అయ్యాను. అందుకే ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశాను అని తేజ సజ్జా తెలిపారు. ఈ సందర్భంగా తేజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ మూవీ మేకర్స్ అలాగే హీరో తేజ బాగా కష్టపడినట్లు చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. వారి కష్టం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండిస్తోంది. ఈ సినిమాలో సూపర్ హీరోలు కోసం ఏకంగా 25 లుక్కులు టెస్టులు చేశారట. మాములుగా నటీనటులకు రెండు-మూడు లుక్ పరీక్షలు చేస్తారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చాలా కష్టమైంది. అలాంటి అన్ని సన్నివేశాల్లో నేనే నటించాను అన్నారు తేజ సజ్జా.

Exit mobile version