Syed Sohel Ryan : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హీరో హీరో సోహైల్ తల్లి మరణించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి పలు సినిమాలు, సీరియల్స్ చేసిన సోహైల్ బిగ్ బాస్ లో పాల్గొని ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు సోహైల్.
లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు.. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వీటిల్లో మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా పర్వాలేదనిపించగా మిగిలినవన్నీ నిరాశ పరిచాయి. సోహైల్ తల్లి ఫైమాసుల్తానా గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంది. హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో రెగ్యులర్ గా డయాలసిస్ చేస్తున్నారు. నేడు ఉదయం పరిస్థితి విషమించి చికిత్స తీసుకుంటూనే సోహైల్ తల్లి ఫైమాసుల్తానా కన్ను మూసారు.
సోహైల్ తల్లి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. సోహైల్ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని వారి స్వస్థలం కరీంనగర్ కు తీసుకువెళ్తున్నారు. అక్కడే మిగతా కార్యక్రమాలు పూర్తిచేయనున్నారు. దీంతో సోహైల్ అభిమానులు, పలువురు సినీ, టీవీ ప్రముఖులు సోహైల్ తల్లికి నివాళులు అర్పిస్తున్నారు.
Also Read : Satya Dev : ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న సత్య దేవ్.. దీపావళి బరిలో..