Site icon HashtagU Telugu

Viral : భయం..భయం గా ‘భూమ్ భూమ్’ బీరు తాగిన నటుడు శ్రీకాంత్

bhoom bhoom bear

bhoom bhoom bear

బీర్ (Beer) అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొంతమంది ప్రతి రోజు డజన్ల కొద్దీ తాగుతుంటారు. కొంతమంది మాత్రం ఏదైనా ఫంక్షన్..పండగ వస్తే తాగుతారు. మరికొంతమంది మాత్రం రిలాక్స్ కోసం తాగుతారు. ఇలా చాలామంది చాలసార్లు తాగుతుంటారు. ఇందులో కొంతమంది మాత్రం ఓ బ్రాండ్ బీర్ ను మాత్రమే ఇష్టపడుతుంటారు. వాటికే ప్రాముఖ్యత ఇస్తారు. ఆ బీర్ లేకపోతే ఏదోకటి తాగేస్తుంటారు. కానీ ఏపీ (Andhra Pradesh)లో మాత్రం బీరు తాగాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా భూమ్ భూమ్ బీర్లు మాత్రమే లభిస్తాయి. ఈ భూమ్ భూమ్ బీర్లు మిగతా చోట్ల ఎక్కువగా కనిపించవు. కేవలం అక్కడే ఉంటాయి. అందుకే అక్కడ ఆ బీరు తాగాలంటే బీరు ప్రియులు ఆలోచిస్తుంటారు.

Read Also : AP Govt : ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు భద్రతను పెంచిన ఏపీ సర్కార్..

ఆ మధ్య డాన్స్ మాస్టర్ రాకేష్ (Rakesh Master) ..భూమ్ భూమ్ బీర్ (Bhoom Bhoom Beer) తాగే చనిపోయాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పటి నుండి ఈ బీర్ తాగాలంటే భయపడుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyyengar) కూడా అలాగే భయపడుతూ తాగారు. ఈ విషయాన్నీ ఆయనే సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు. తెలుగులో నటుడిగా అనేక సినిమాలలో నటించి సత్తా చాటిన శ్రీకాంత్ ఈ మధ్య సోషల్ మీడియా (Social Media)లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈమధ్య ఒకామెను పెళ్లి చేసుకోవాలి అని ఉందంటూ పోస్టు పెట్టి డిలీట్ చేసిన ఆయన చర్చనీయాంశం అయ్యారు. ఇప్పుడు భూమ్ భూమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసి కొత్త చర్చకు దారి తీసారు. తాను ఏపీకి వచ్చానని, విజయవాడలో ఉన్నానని వీడియోలో చెప్పిన ఆయన అక్కడి బీర్ తీసుకుని తాగుతున్నాను అంటూ బూం బూం బీర్ ను చూపించాడు. ఈ బీరు తాగుతున్నట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదని, ఏం అవుతుందో ఏమో అంటూ భయపడుతూ ఆ బీరు గటగటా తాగేశాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తాను శ్రీకాంత్ అయ్యంగార్ అని అంటూనే సారీ పేరు మారింది కదా తాను శ్రీకాంత్ భారత్ అని అంటూ మరో సెటైర్ వేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఏపీలో మాత్రమే మందు మీద ఆయన కౌంటర్ వేశాడని కొందరు అంటుంటే భారత్ అని పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం మీద ఆయన కౌంటర్ వేశాడని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి మరోసారి భూమ్ భూమ్ బీర్ మాత్రం వైరల్ గా మారింది.

https://x.com/Shri__Bharat/status/1701277726613868604?s=20