Bigg Boss Telugu7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంటర్టైన్మెంట్ ముగిసింది. ఈ సారి సాధారణ వ్యక్తులతో నడిచిన బిబి షో ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రేక్షకుల బిగ్ బాస్ షో కోసం టీవీలకు అతుక్కుపోయారంటే షో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో చెప్పవచ్చు. గత సీజన్ అంతగా ఆకట్టుకోనప్పటికీ ఈ ఏడాది షో మాత్రం అదరగొట్టింది. ఉల్టా పుల్టా అంటూ మొదలై అన్ని ఎపిసోడ్స్ అంతే ఆసక్తిని రేకెత్తించింది. టైటిలే లక్ష్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ తమ తమ వ్యూహాలతో గేమ్ ను రక్తికట్టించారు. నాగార్జున మరోసారి సీజన్ సెవెన్ లో ఆకట్టుకున్నారు. కాగా బిగ్ బాస్ లో రెమ్యూనరేషన్ అంశం ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తుంది. బిగ్ బాస్ షో ద్వారా హీరో శివాజీ భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడనే వార్త వైరల్ అవుతోంది. శివాజీ బిగ్ బాస్ ఏడో సీజన్ లో రోజుకి 60 వేలకు పైగా వసూలు చేశాడట. 15 వారాల పాటు హౌస్ లో ఉన్న శివాజీ మొత్తం 63.75 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లోని అందరి కంటెస్టెంట్స్‌తో పోలిస్తే ఇదే అత్యధిక మొత్తం అని అంటున్నారు. అయితే విన్నర్ కంటే శివాజీ ఎక్కువ మొత్తం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్టార్ డమ్ అండ్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని.. ఈ షోను శివాజీ హిలయరెస్‌గా మారుస్తాడని నమ్మి మరీ.. బిగ్ బాస్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్‌ను ఆయనకు ఫిక్స్ చేశారట.
Bigg Boss Telugu7: శివాజీకి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

Bigg Boss Telugu7