Site icon HashtagU Telugu

Satydev : సత్యదేవ్ బ్రాండ్ అంబాసడర్ గా.. విజయ్ దేవరకొండ గెస్ట్ గా..

Actor Satydev as Brand Ambassador for Sri Chakra Milk Products

Satyadev Vijay

Satydev : హీరో సత్యదేవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా ఎదిగి సినిమాలతో బిజీ అయ్యాడు. మన సెలబ్రిటీలంతా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు స్టార్ డమ్ ఉన్నప్పుడే యాడ్స్, బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసేస్తున్నారు. తాజాగా హీరో సత్యదేవ్ కూడా ఇప్పుడు ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.

తెలుగు రాష్ట్రాల్లో పాలు, పాల పదార్థాలు సప్లై చేసే సంస్థ శ్రీ చక్రా మిల్క్ ప్రోడక్ట్స్ తమ ప్రయాణం మొదలుపెట్టి 10 ఏళ్ళు అయిన సందర్భంగా తాజాగా హైదరాబాద్ లో శ్రీ చక్రా మిల్క్ ప్రోడక్ట్స్ 10 ఏళ్ళ స్పెషల్ ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో సత్యదేవ్ తో పాటు విజయ్ దేవరకొండ, ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ నేత టీడీ జనార్దన్, పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు శ్రీ చక్ర మిల్క్ ఎండి శ్రీ రామంజనేయులు, కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.

ఇప్పటినుంచి శ్రీ చక్రా మిల్క్ ప్రోడక్ట్స్ కి సత్యదేవ్ బ్రాండ్ అంబాసడర్ గా ఉండనున్నారు. హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా రాగా కంపెనీకి కంగ్రాట్స్ తెలిపారు. ఇద్దరు హీరోలు ఒకే స్టేజిపై కనిపించడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. శ్రీ చక్ర మిల్క్ కమర్షియల్ యాడ్ ని విజయ దేవరకొండ లాంచ్ చేశాడు. కంపెనీకి సంబంధించిన బ్రోచర్లు, ఫ్లైయర్‌లు కూడా లాంచ్ చేశారు.

 

Also Read : Shankar : శంకర్ సినిమాటిక్ యూనివర్స్.. వాళ్లు చెడగొట్టేశారు లేదంటే..!