Sarath Babu: టాలీవుడ్ లో విషాదం.. సినీ నటుడు శరత్ బాబు మృతి!

మృత్యువుతో పోరాడుతున్న శరత్ బాబు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మృతిచెందారు.

  • Written By:
  • Updated On - May 22, 2023 / 03:48 PM IST

దాదాపు రెండు మాసాలుగా అనారోగ్యంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడి చనిపోయారు. హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు.  1974లో రామరాజ్యం సినిమాలో హీరోగా పరిచయమై వచ్చిన శరత్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా అనే సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాలు అనేకం విజయవంతమయ్యాయి.

సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమ కింకరుడు, అమరజీవి ఇలా అనేక సినిమాల్లో నటించారు. ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు. శరత్ బాబు కుటుంబంలో ఆయన మృతి విషాదాన్ని నింపింది. శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి ఆమదాలవలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది.

శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు. సత్యన్నారాయణ దీక్షితులుగా పిలుచుకునే శరత్ బాబును ఆయన కుటుంబకులు సత్యం బాబుగా పిలుస్తారు. దాదాపు 5 దశాబ్దాలుగా సినిమా రంగంలో రాణించారు. సీతాకొకచిలుక, సితార లాంటి సినిమాలతో శరత్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సహజ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారాయన.

Also Read: Tech Companies: వామ్మో ఐటీ.. 2023లో 2 లక్షల ఉద్యోగాలు ఔట్!