Site icon HashtagU Telugu

Sapthagiri : సినీ పరిశ్రమలో విషాదం.. హీరో తల్లి కన్నుమూత..

Actor Sapthagiri Mother Passed away

Sapthagiri Mother

Sapthagiri : తాజాగా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కమెడియన్, హీరో సప్తగిరి తల్లి మరణించారు. సప్తగిరి తల్లి నిన్న రాత్రి పలు ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. నేడు తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయం సప్తగిరి అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మిస్ యు అమ్మ అంటూ తన తల్లి ఫోటో షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపారు సప్తగిరి.

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన సప్తగిరి పరుగు సినిమాతో కమెడియన్ గా మారారు. ఆ తర్వాత కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం పెళ్లి కానీ ప్రసాద్ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు.

సప్తగిరి తల్లి మరణించడంతో పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

 

Also Read : Mark Shankar : మార్క్ శంకర్ క్షేమం..అరా తీసిన వారికీ కృతజ్ఞతలు – పవన్