Site icon HashtagU Telugu

Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్

Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika Mandanna: సినీ నటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస హిట్ సినిమాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంటోంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ పుష్ప2లో నటిస్తోంది. కాగా గతకొంత కాలంగా రష్మిక వార్తల్లో నిలుస్తుంది. ఆమె డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా వివాదం సృష్టించింది. గతేడాది నవంబర్‌లో రష్మికాకు చెందిన ఒక వీడియో వైరల్‌ అయ్యింది అయితే తాజాగా ఈ డీప్‌ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీంతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పోలీసులు చెక్ పెట్టాలని కోరుతున్నారు.

రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. డీప్ ఫేక్ వీడియోల పట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో రష్మిక డీప్‌ఫేక్ సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఎపిలో అరెస్ట్ చేశామని డిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి బ్రిటీష్- ఇండియన్ ఇన్ ప్ల్యూయెన్స్ అయిన జరా పటేల్ శరీరానికి రష్మిక ముఖం పెట్టి డీప్ ఫేక్ వీడియో తయారు చేశాడు. నిందితుడు వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్ 465, 469 కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

డీప్ ఫేక్ భారీన మరికొందరు సెలబ్రిటీలు పడ్డారు . తాజాగా సచిన్ డీప్ ఫేక్ బారీన పడగా..అంతకుముందు కాజోల్, కత్రినా కైఫ్, అలియా భట్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయ్యారు. సోనూసూద్ వీడియో ప్రస్తతం నెట్టింట ప్రత్యక్షమయింది. నవంబర్‌ 10వ తేదీన సోషల్‌ మీడియాలో రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో విడుదలైన విషయం తెలిసిందే.

Also Read: Megastar: యండమూరి వీరేంద్రనాథ్ రచనల వల్లే మెగాస్టార్ ను అయ్యాను: చిరంజీవి