Site icon HashtagU Telugu

Actor Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ప్రధాని చేతుల మీదుగా సన్మానం.. ఎక్కడంటే..?

Actor Ram Charan

Resizeimagesize (1280 X 720) (1)

న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో రామ్ చరణ్ (Ram Charan) పాల్గొనన్నునారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ ఈవెంట్ కు ప్రధాని మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా రాబోతున్నారు. మోదీతో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా ఈ ఈవెంట్ కు రానున్నారు. ఆస్కార్ తరువాత చరణ్ ఈ ప్రోగ్రామ్ కు రాబోతుండటంతో చరణ్ ని ఘనంగా సన్మానించడానికి ఏర్పాట్లు జరగబోతున్నట్టు తెలుస్తోంది.

తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటిచెప్పినందుకుగానూ చరణ్ ని ప్రధాని మోదీ సన్మానించబోతున్నారని సమాచారం. ఈ స్టేజీపై నుంచి రామ్ చరణ్ మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన విధానం, గ్లోబల్ వైడ్ సక్సెస్ కావడంతో పాటు ఆస్కార్ గెలుచుకోవడం లాంటి విషయాలు చరణ్..మోదీకి వివరించే అవకాశం ఉంది.

Also Read: Meta Layoffs: మెటాలో మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు.. 10,000 మంది ఉద్యోగులు ఔట్..!

మార్చి 17-18 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఇది ఇండియా టుడే కాంక్లేవ్ 20వ ఎడిషన్. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2019లో కరోనాకి ముందు ప్రధాని మోదీ కాన్‌క్లేవ్‌లో ప్రసంగించారు. అయితే అప్పటి నుండి చాలా మార్పులు వచ్చాయి. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ప్రధాని మోదీ ఒకరిగా పరిగణించబడ్డారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ప్రధాని మోదీ చేసే ప్రసంగం, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ కల్లోలం జరుగుతున్న తరుణంలో జరగబోతోంది.

ఇంతకు ముందు ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ప్రధాని మోదీ 6 సార్లు ప్రసంగించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమంలో గుజరాత్ మోడల్‌ను ప్రవేశపెట్టారు. దీని తర్వాత ప్రధానమంత్రిగా అతను అందరి ముందు నవ భారత లక్ష్యాలను ఉంచాడు. 2003, 2008, 2011లో ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత 2013లో బీజేపీలో చేరి ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు. 2017, 2019లో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో కూడా ప్రధాని మోదీ ప్రసంగించారు.

Exit mobile version