Site icon HashtagU Telugu

రజనీకాంత్​ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

రజనీ ఇటీవల స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఇది విజయవంతంగా పూర్తయింది.అంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ చేయించుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నారని చెన్నైలోని కావేరి ఆసుపత్రి తెలిపింది. వైద్యుల బృందం రజనీని పరీక్షించి, కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ చేయించుకోవాలని సూచించడంతో శస్త్రచికిత్స పూర్తయింది.

రజనీకాంత్ గత ఏడాది డిసెంబర్లో బీపీ పెరగడం వల్ల హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన ఓ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే చిత్రబృందం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు చికిత్స అందించారు. దీంతో రెండు రోజుల్లో ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు. ఆ తరువాత తనకు ఆరోగ్యం సహకరించడంలేదంటూ పార్టీ ని స్థాపించడంలేదని ఆయన ప్రకటించారు.ఇది భగవంతుడు నాకు ఇచ్చిన హెచ్చరికగా తాను భావిస్తున్నానని…పార్టీని ప్రారంభించిన తర్వాత మీడియా, సోషల్ మీడియా ద్వారా మాత్రమే ప్రచారం చేస్తే రాజకీయాల్లో రాణించలేనని ఆయన తెలిపారు.

Exit mobile version