Site icon HashtagU Telugu

Rahul Ramakrishna: లిప్ లాక్ తో పెళ్లి కబురు చెప్పిన కమెడియన్..!!

Rahul Ramakrishna

Rahul Ramakrishna

రాహుల్ రామకృష్ణ…కమెడియన్, సహాయనటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు రాహుల్. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించాడు. తనకు కాబోయే భార్యకు లిప్ లాక్ ఇస్తూ…తీసుకున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే రాహుల్ కోవిడ్ కంటే ముందే తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ అప్పుడు కుదరలేదు. పెళ్లిని వాయిదా వేసాడు. ఇప్పుడు పరిస్థితులు సద్ధుమణగడంతో పెళ్లికి రెడీ అయ్యాడు ఈ కమెడియన్.

ఇక రాహుల్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి బిందు…సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వీళ్లిద్దరూ కూడా  ఒక పార్టీలో కలుసుకున్నారట. అప్పటినుంచి వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కాస్త ప్రేమగా మారింది. వ్యక్తిగతంగా గానీ ,వృత్తిపరంగా గానీ తమ అభిప్రాయాలు ఒక్కటిగా ఉంటాయని…తాము చాలా త్వరగా దగ్గరయ్యామని రాహుల్ చెప్పాడు. అయితే రాహుల్ ఇదివరకెప్పుడూ ఆ అమ్మాయి ఫొటోను షేర్ చేయలేదు. ఇప్పుడు లిప్ లాక్ తన ప్రియురాలిని ప్రపంచానికి పరిచయం చేశాడు.

https://twitter.com/eyrahul/status/1523081419211558912