Site icon HashtagU Telugu

R Subbalakshmi: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

R Subbalakshmi

Compressjpeg.online 1280x720 Image 11zon

R Subbalakshmi: మలయాళ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళంతోపాటు బాలీవుడ్‌లో కూడా నటించిన ప్రముఖ సీనియర్ నటి ఆర్.సుబ్బలక్ష్మి (R Subbalakshmi) కన్నుమూశారు. నవంబర్ 30న ప్రముఖ మలయాళ సినీ నటి ఆర్. సుబ్బలక్ష్మి కన్నుమూశారు. ఆమె వయస్సు 87 సంవత్సరాలు. వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను రక్షించలేకపోయారు. గురువారం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

ఆర్ సుబ్బలక్ష్మి మృతి మలయాళ సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆమె మలయాళ సినిమాలో తన అద్భుతమైన నటనకు ప్రసిద్ద. ఆమె మంచి నటి మాత్రమే కాదు, అద్భుతమైన కర్ణాటక సంగీత విద్వాంసురాలు, చిత్రకారిణి కూడా. మలయాళ సినిమాల్లో అమ్మమ్మ పాత్రలో ఎప్పుడూ వినయంతో ఆకట్టుకునేలా చేసింది. అమ్మమ్మ పాత్ర ఆమెకు భిన్నమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. చాలా సార్లు ప్రజలు ఆమె అసలు పేరుకు బదులుగా అమ్మమ్మ అని పిలిచేవారు. ఆమె దాదాపు 75 సినిమాల్లో నటించారు. తమిళంలో విజయ్ నటించిన బీస్ట్ సుబ్బలక్ష్మికి చివరి సినిమా కాగా తెలుగులో నాగచైతన్య నటించిన ఏమాయ చేశావే సినిమాలో కూడా సుబ్బలక్ష్మి నటించారు. ఆల్ ఇండియా రేడియోలోనూ వర్క్ చేశారు. రేడియోలో దక్షిణాది నుంచి వచ్చిన తొలి మహిళా కంపోజర్‌గా ఆమె రికార్డులకెక్కారు.

Also Read: Animal Movie Twitter Review: యానిమల్ మూవీ ట్విట్టర్ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే..?

ఆర్ సుబ్బలక్ష్మి తన నటనా జీవితంలో తను పోషించిన పాత్రలన్నిటినీ బహిరంగంగా జీవించింది. సినిమాల్లో ఆమె నటించిన చాలా పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడ్డాయి. కళ్యాణరామన్ (2002), నందనం (2002),పండిప్ప (2005) వంటి అనేక చిత్రాలలో నటించింది. ఆర్ సుబ్బలక్ష్మి మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మలయాళ నటుడు దిలీప్ సంతాపం తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.