Site icon HashtagU Telugu

Pradeep K. Vijayan : నటుడు ప్రదీప్ విజయన్ మృతి

Pradeep K. Vijayan Died

Pradeep K. Vijayan Died

చిత్రసీమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఐదు నెలల కాలంలో అనేక మంది సినీ దిగ్గజాలను కోల్పోయింది. ఈ వారంలో టాలీవుడ్ బడా నిర్మాత, మీడియా మొఘల్ రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత, ఈనాడు సంస్థల గ్రూప్ వ్యవస్థాపకుడు రామోజీరావు (Ramojirao) అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ లో మరో నటి అనుమానాస్పద రీతిలో మరణించడం కలవర పాటుకు గురి చేసింది. ఇలా వరుస విషాదాలు వింటుండగానే మరో విషాద వార్త అభిమానులను షాక్ కు గురి చేసింది. తమిళ్ సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా మెప్పిస్తున్న ప్రదీప్ విజయన్ (Pradeep K. Vijayan) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ప్రస్తుతం వయసు 35 ఇయర్స్. ఇంకా పెళ్లి చేసుకొని విజయ్..ప్రస్తుతం సింగిల్ గా ఒక రూమ్ లో ఉంటున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

గత రెండు రోజులుగా అతని స్నేహితులు ఫోన్ చేస్తుండగా.. ఎటువంటి సమాధానం రావడం లేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి వెళ్లి చూడగా.. నిర్జీవంగా పడి ఉంటాన్ని చూశారు. అయితే గుండెపోటుతో మరణించినట్లు తొలుత అంచనాకు వచ్చారు. కానీ అతడి తలకు గాయమై చనిపోయినట్లు తెలుస్తుంది. నటుడు ప్రదీప్‌కు వివాహం కాలేదు. పాలవాక్కంలోని శంకరపురం మొదటి వీధిలో ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే ఇటీవల అతడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మైకం కమ్మినట్లు అనిపించడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. మృతదేహాన్ని రాయపేట ఆసుపత్రికి తరలించారు.

ప్రదీప్ టెడ్డీ, ఇరంబు తిరై (అభిమన్యుడు), లిఫ్ట్, మనం, కెనడీ క్లబ్, ఆడై, హే సినామిక వంటి చిత్రాల్లో నటించాడు. రుద్రన్ మూవీలో కూడా కనిపించాడు. విజయ్ సేతు పతి మహారాజా చిత్రంలో యాక్ట్ చేశాడు. రేపు (జూన్ 14) ఈ సినిమా విడుదలవుతుండగా.. అంతలోనే మృతి చెందాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also : Venkat Balmoor : సీఎం రేవంత్ ఫోటో పై బాల్క సుమన్ వ్యాఖ్యలకు బల్మూరి వెంకట్ కౌంటర్