Nayanthara : ప్రముఖ హీరోయిన్ నయనతార ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని, అందుకే ఆమె ఇప్పుడు డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీడియాలోనూ వరుస కథనాలు వస్తున్నాయి. దీంతో ఎట్టకేలకు ఈవిషయంపై క్లారిటీ ఇచ్చేందుకు స్వయంగా నయనతార ముందుకొచ్చారు.
Also Read :Census : 2025లో జనగణన.. 2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన
తన ముఖం ఇప్పుడు డిఫరెంట్ లుక్‌లో ఎందుకు కనిపిస్తోంది అనే దానిపై నయనతార(Nayanthara) క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదని ఆమె తేల్చి చెప్పారు. తన ముఖాన్ని మార్చుకోవాలని ఎన్నడూ కనీసం ఆలోచించలేదని నయనతార స్పష్టం చేశారు. ‘‘కనుబొమ్మలను చూడచక్కగా అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసం నేను చాలా టైం వెచ్చిస్తుంటాను. వాటి వల్లే ఒక్కోసారి ఒక్కో విధంగా నా ఫేస్ కనిపిస్తుంటుంది. నా కనుబొమ్మల అలంకరణకు అనుగుణంగా ఫేస్ లుక్ మారినట్టుగా అనిపిస్తుంది. బహుశా.. అందుకే నా ఫేస్‌లో ఏదో మార్పు జరిగిందనే ఫీలింగ్‌కు అభిమానులు వస్తుంటారు’’ అని నయనతార వివరించారు. ప్రతిసారి డిఫరెంట్‌గా అలంకరించుకొని ముందుకు రావడం అంటే తనకెంతో ఇష్టమని ఆమె చెప్పారు.
Also Read :Terror Attack : కశ్మీరులో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు.. మళ్లీ ఉద్రిక్తత
‘‘నేను తీసుకునే డైట్ కూడా ఈవిషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీర బరువు కంట్రోల్‌లో ఉండేలా నా డైట్ ఉంటుంది. ఒక్కోసారి నా డైట్ వల్ల శరీర బరువుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. బహుశా ఆ ప్రభావం వల్ల కూడా నా చెంపలు పైకి, లోపలికి మారుతుంటాయి. అవసరమైతే మీరు నా ముఖాన్ని ఒకసారి గిల్లి చూడొచ్చు. ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీని నేను చేయించుకోలేదు. ప్లాస్టిక్ ముచ్చటే లేదు’’ అని నయనతార వివరించారు.