Site icon HashtagU Telugu

Actor Nasser : ప్రముఖ నటుడు నాజర్ ఇంట విషాదం ..

Actor Nasser

Actor Nasser

చిత్రసీమలో వరుస విషాదాలు నమోదు అవుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తండ్రి శ్యాంసుందర్ రెడ్డి ( Shyam Sunder Reddy ) (86) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యాంసుందర్ రెడ్డి .. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ విషాద ఘటన గురించి ఇంకా మాట్లాడుతుండగానే..మరో విషాద వార్త చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ (Actor Nasser)తండ్రి మెహబూబ్ బాషా (95 ) కన్నుమూశారు.

We’re now on WhatsApp. Click to Join.

మెహబూబ్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా..ఈరోజు పరిస్థితి విషమించడంతో తమిళనాడులోని చెంగల్పట్టులో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మెహబూబ్ బాషా మృతి విషయాన్ని నాజర్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. కాగా, పితృవియోగంతో బాధపడుతున్న నాజర్ కు బంధుమిత్రులు, సినీ ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. కాగా, మెహబూబ్ బాషా అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు.

ఇక మహబూబ్ భాషా కు ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు. 1977 లో నాజర్ అవకాశాల కోసం మద్రాసుకు వచ్చి తాజ్ కోరమాండల్ హోటల్ లో పనిచేశాడు. అక్కడ నుంచే ఆయన సినీ ప్రస్థానం ప్రారంభించారు. అజయకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ (1993 ), మణిరత్నం బాంబే (1995), శంకర్ జీన్స్ (1998), త్రివిక్రం శ్రీనివాస్ అతడు (2005 ) చిత్రాలలో అద్వితీయమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చంటి సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం ,. మాతృదేవోభవ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం నాజర్ క్యారెక్టర్ అరెస్ట్ గా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

Read Also : Amartya Sen: మా నాన్న చనిపోలేదు, నోబెల్ గ్రహీత కుమార్తె క్లారిటీ