Site icon HashtagU Telugu

Mammootty’s Mother: మలయాళ ఇండస్ట్రీలో విషాదం.. మమ్ముట్టి తల్లి కన్నుమూత!

Mamootty

Mamootty

మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి తల్లి (Mammootty’s Mother) ఫాతిమా ఇస్మాయిల్ (93) శుక్రవారం కొచ్చిలో తుది శ్వాస (Passed Away) విడిచారు. వృద్ధాప్య కారణాలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆమె ఓ ప్రైవేట్ (Private Hospital) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయంత్రం వైకోమ్‌లోని జుమా మసీదులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆమెకు మిస్టర్ మమ్ముట్టితో పాటు, నటుడు ఇబ్రహీం కుట్టి, జకారియా కొడుకులున్నారు. అమీనా, సౌదా, షఫీనా కుమార్తెలున్నారు. మమ్ముటి తల్లి అకాల మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆమె మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ హీరోలు, యాక్టర్స్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియా పోస్ట్‌లో సంతాపం తెలిపారు.

Also Read: Virupaksha Review: విరూపాక్ష‌ మూవీ రివ్యూ.. సాయి ధరమ్ తేజ్ కు గట్టి హిట్ పడినట్టేనా?