Malaika Arora : బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న తన భవనం పైనుంచి దూకి ఆయన సూసైడ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ పోలీసులకు దొరకలేదు. ఇంతకీ ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారు ? కారణం ఏమిటి ? అనేది తెలియరాలేదు.
Also Read :Locals Vs Cops Clash : పోలీసులు వర్సెస్ నిరసనకారులు.. మసీదు వైపుగా దూసుకెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత
అనిల్ అరోరా సూసైడ్ చేసుకున్న టైంలో కూతురు మలైకా అరోరా(Malaika Arora) ఇంట్లో లేరు అని పోలీసు వర్గాలు తెలిపాయి. అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిన వెంటనే మలైకా అరోరా కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకున్నారు. మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ కూడా అక్కడికి చేరుకొని.. అనిల్ అరోరా మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా, అనిల్ అరోరా నేపథ్యంలోకి వెళితే ఆయన పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. గతంలో ఆయన మర్చంట్ నేవీలో సేవలు అందించారు. మలైకా అరోరా 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన భార్య జాయ్స్ పాలీకార్ప్ నుంచి అనిల్ అరోరా విడాకులు తీసుకున్నారు. ఆ టైంలో మలైకా అరోరా చెల్లెలు అమృత వయసు ఆరేళ్లు. విడాకుల తర్వాత మలైకా అరోరా, అమృతలను వారి తల్లి జాయ్స్ పాలీకార్ప్ పెంచి పెద్దచేశారు. మలైకా అరోరా నటిగా, మోడల్‌గా, డ్యాన్సర్‌గా, వీడియో జాకీగా మంచి పేరు సంపాదించారు. కాంటే, ఈఎంఐ లాంటి సినిమాలతో ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది. ఛయ్య ఛయ్య, గుర్ నాలో ఇష్క్ మీఠా, మాహీ వే, కాల్ థమాల్, మున్ని బద్నాం లాంటి సాంగ్స్‌లో నటించి మలైకా అరోరా సినీ ప్రపంచంలో చాలా ఫేమస్ అయ్యారు.