Mahesh Babu In Queue: టికెట్ కోసం క్యూలో నిల్చున్న మహేశ్ బాబు…వైరల్ వీడియో..!!

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాను నిర్మించిన మేజర్ సినిమాను వినూత్నంగా ప్రమోట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాను నిర్మించిన మేజర్ సినిమాను వినూత్నంగా ప్రమోట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం…సినిమా టికెట్ కోసం ఓ థియేటర్ క్యూలో నిల్చుంటారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చిన కొందరు ఆమె కంటే ముందు క్యూలో నిల్చుంటారు. దీంతో నిహారిక ఆశ్చర్యపోతారు. కొద్దిసేపటికే ఆ మూవీ హీరో అడవి శేష్ వచ్చి ఆమె ముందు నిల్చుంటాడు. దీంతో నిహారికకు అడవిశేష్ కు మధ్య వాగ్వివాదం జరుగుతుంది.

వారి మధ్య గొడవ జరుగుతుండగా…మధ్యలో మహేశ్ బాబు వచ్చి నిల్చుంటాడు. అతడ్ని చూసిన నిహారిక షాక్ అవుతుంది. అప్పుడు మహేశ్ మా ఫ్రెండ్స్ ను కూడా పిలవొచ్చా అని ప్రశ్నిస్తాడు. అందుకు ఆమె సరే అని చెబుతుంది. దీంతో లైన్ లో ఒక్కసారిగా క్యూ పెరిగిపోతోంది. నిహారిక ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు దూసుకుపోతోంది. ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన జవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథగా ఈ సినిమాను రూపొందించారు. జూన్ 3న తెలుగు, మలయాళం హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

 

 

  Last Updated: 30 May 2022, 10:28 AM IST