Jhansi : జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ నిన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ లో జానీ మాస్టర్ కేసు వైరల్ గా మారింది. తాజాగా నేడు టాలీవుడ్ లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ ప్రెస్ మెట్ పెట్టి ఈ కేసు గురించి మాట్లాడారు.
ఈ నేపథ్యంలో యాంకర్, నటి ఝాన్సీ మాట్లాడుతూ.. ఆ అమ్మాయి ప్రస్తుతం ఒక పెద్ద నిర్మాణ సంస్థలో పనిచేస్తుంది. పెద్ద డైరెక్టర్ ఆల్రెడీ తనకు వర్క్స్ ఇస్తాను అని మాట ఇచ్చారు. అలాగే ఓ పెద్ద హీరో తన మేనేజర్ ని తన దగ్గరికి పంపించి తనకు సపోర్ట్ ఉంటామని, తన సినిమాలో అవకాశం ఇస్తానని తెలిపారు. దీనివల్ల ఇండస్ట్రీలో ట్యాలెంట్ కి సపోర్ట్ ఉంటుంది అని తెలిపింది. అయితే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తా అన్న హీరో అల్లు అర్జున్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
ఢీ షోతో పరిచయమైన ఆ డ్యాన్సర్ ఆ తర్వాత జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసింది. ఇటీవలే సొంతంగా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తుంది. గత కొన్నాళ్లుగా జానీ మాస్టర్ లైంగికంగా వేధించడంతో పాటు మతం మారి పెళ్లి చేసుకొమ్మని బలవంతం పెడుతున్నాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు.
Big Hero’s Support To Victim In Jani Master’s Case
ఒక పెద్ద హీరో తన manager తో ఫోన్ చేయించి తన సినిమాలో ఆ అమ్మాయికి అవకాశం ఇస్తా అన్నారు#Tollywood pic.twitter.com/UNyhgjIxOR
— M9 NEWS (@M9News_) September 17, 2024
Also Read : Syed Sohel Ryan : హీరో సోహైల్ ఇంట విషాదం.. సోహైల్ తల్లి కన్నుమూత..